Errabelli: 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

  • వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 80 సీట్లలో విజయం సాధిస్తుందన్న ఎర్రబెల్లి
  • 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే ఆ సంఖ్య 100కు పెరుగుతుందన్న మంత్రి
  • కాంగ్రెస్ గరిష్ఠంగా 25, బీజేపీ 20 స్థానాలు గెలుచుకుంటాయని జోస్యం
Telangana Minister Errabelli Dayakar Rao Sensational Comments On Sitting MLAs

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 100 సీట్లలో విజయం సాధిస్తుందని అయితే, అంతకంటే ముందు 15 నుంచి 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాల్సి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో నిన్న నిర్వహించిన పార్టీ సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గరిష్ఠంగా 25 స్థానాలు, బీజేపీ 20 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందన్నారు. బీఆర్ఎస్ మాత్రం 80 స్థానాల్లో విజయం సాధిస్తుందని, ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న 15-20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే ఆ సంఖ్య 100కు పెరుగుతుందని అన్నారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఆరేడు జిల్లాల్లోను, బీజేపీ-బీఆర్ఎస్ మధ్య మూడు నాలుగు జిల్లాల్లో మాత్రమే పోటీ ఉంటుందని, మిగతా చోట్ల బీఆర్ఎస్‌కు పోటీ లేదని ఎర్రబెల్లి జోస్యం చెప్పారు.

More Telugu News