KCR: నేడు మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లో కేసీఆర్ పర్యటన.. షెడ్యూల్ ఇదిగో!

  • రెండు జిల్లాల్లో నూతన కలెక్టరేట్లను ప్రారంభించనున్న సీఎం
  • మహబూబాబాద్, కొత్తగూడెంలలో బహిరంగసభలు
  • సాయంత్రం 5.40 గంటలకు మళ్లీ ప్రగతి భవన్ కు చేరుకోనున్న సీఎం
KCR tour in Mahabubabad and Bhadradri districts

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. నూతన కలెక్టరేట్ల భవనాలను ఆయన ప్రారంభించనున్నారు. 

కేసీఆర్ షెడ్యూల్ వివరాలు:

  • ఉదయం 10 గంటలకు బేగం పేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 
  • 10.15 గంటలకు హెలికాప్టర్ లో మహబూబాబాద్ కు బయల్దేరుతారు. 
  • 11 గంటలకు మహబూబాబాద్ కు చేరుకుంటారు. 
  • 11.10 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 
  • 11.40 నుంచి 1.30 గంటల వరకు నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించి, అక్కడి బహిరంగ సభలో పాల్గొంటారు. 
  • అనంతరం అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1.30 గంటలకు కొత్తగూడెంకు చేరుకుంటారు. 
  • 1.55 గంటలకు నూతన కలెక్టరేట్ ను ప్రారంభిస్తారు. 
  • 2.55 గంటల నుంచి 3.20 వరకు బహిరంగసభలో పాల్గొంటారు. 
  • 4.30 గంటలకు హైదరాబాద్ కు తిరుగుపయనమవుతారు. 
  • సాయంత్రం 5.40 గంటలకు ప్రగతి భవన్ కు చేరుకుంటారు.

More Telugu News