India: భారత క్రీడల్లో డోపింగ్ కలకలం.. డోప్​ టెస్టులో పట్టుబడ్డ స్టార్ వెయిట్ లిఫ్టర్ చాను

  • కామన్వెల్త్ క్రీడల్లో రెండు సార్లు స్వర్ణ పతకాలు గెలిచిన మణిపూర్ లిఫ్టర్ సంజిత చాను
  • గతేడాది జాతీయ క్రీడల సందర్భంగా సేకరించిన శాంపిల్స్ లో ఉత్ప్రేరకం గుర్తింపు
  • సంజితపై  ప్రాథమిక నిషేధం విధించిన నాడా
Two time CWG weightlifting champ Sanjita fails dope test

భారత క్రీడారంగంలో మరోసారి డోపింగ్ కలకలం రేగింది. స్టార్ వెయిట్ లిఫ్టర్, కామన్వెల్త్ క్రీడల్లో రెండు సార్లు స్వర్ణం గెలిచిన కె. సంజిత చాను డోపింగ్ లో పట్టుబడింది. ఆమె డ్రొస్టనొలోన్ అనే ఉత్ర్పేరకం వాడినట్టు పరీక్షల్లో తేలింది. దాంతో, జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఆమెపై ప్రాథమిక నిషేధం విధించింది. గత  సెప్టెంబర్–అక్టోబర్ లో గుజరాత్ లో జరిగిన జాతీయ క్రీడల సందర్భంగా మణిపూర్ కు చెందిన సంజిత చాను నుంచి సేకరించిన శాంపిల్స్ పరీక్షించగా అందులో ఉత్ప్రేరకాన్ని గుర్తించారు.  శాంపిల్ సేకరించిన తేదీ నుంచి ఆమెపై ప్రాథమిక నిషేధం అమల్లో ఉంటుందని నాడా తెలిపింది. 

సంజిత కేసును ఇప్పుడు నాడా డోపింగ్ నిరోధక క్రమశిక్షణ ప్యానెల్ విచారిస్తుంది. సంజిత ఉద్దేశపూర్వకంగా డోపింగ్ కు పాల్పడినట్టు తేలితే ఆమెపై నాలుగేళ్ల వరకు నిషేధం పడే అవకాశం ఉంది. కాగా, గతేడాది బర్మింగ్ హామ్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో సంజిత బంగారు పతకం గెలిచింది. ఆమె గతంలో కూడా డోపింగ్ కారణంగా నిషేధం ఎదుర్కొంది. 2018 మేలో ఆమె శాంపిల్స్ లో టెస్టోస్టిరాన్ ను గుర్తించడంతో అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య సస్పెన్షన్ వేటు వేసింది. కానీ, అధికారుల తప్పిదం కారణంగా సంజిత శాంపిల్  మిక్సింగ్ అయినట్టు గుర్తించడంతో 2020లో ఆమెపై వేటను తొలగించారు.

More Telugu News