Karan Johar: సత్తా ఉండదు కానీ.. : బాలీవుడ్ హీరోలపై కరణ్ జొహార్ విమర్శలు

  • ఓపెనింగ్స్ కూడా రాబట్టలేని వాళ్లు కోట్లు అడుగుతున్నారని కరణ్ మండిపాటు
  • చాలా మంది హీరోలు తామే స్టార్లు అనే భ్రమల్లో ఉంటారని విమర్శ
  • తమ క్రేజ్ నుంచి కలెక్షన్లు వస్తాయనే భ్రమల నుంచి బయటపడాలని హితవు
Karan Johar satires on Bollywood heros

బాలీవుడ్ హీరోలు తీసుకునే రెమ్యునరేషన్లపై ప్రముఖ నిర్మాత కరణ్ జొహార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు హీరోలకు లాభాలు తీసుకొచ్చే సత్తా లేకపోయినా కోట్ల రూపాయల్లో రెమ్యునరేషన్ అడుగుతుంటారని విమర్శించారు. ఇలాంటి హీరోల వల్ల తాను ఎంతో నష్టపోయానని చెప్పారు. కొందరు హీరోల వల్ల బాలీవుడ్ ఆర్థికంగా చాలా నష్టపోయిందని అన్నారు. రూ. 5 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్లను కూడా రాబట్టలేని హీరోలు... రూ. 30 నుంచి 40 కోట్ల పారితోషికం కావాలని డిమాండ్ చేయడంలో అర్థం లేదని చెప్పారు. ఇలా చెపితే తనను హత్య చేస్తారేమో కానీ... సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి తాను నిజాలను మాట్లాడతానని అన్నారు. 

సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం స్టార్ల రెమ్యునరేషన్ కే పోతోందని కరణ్ జొహార్ చెప్పారు. బాలీవుడ్ లో చాలా మంది హీరోలు తామే స్టార్లు అనే భ్రమలో ఉంటారని విమర్శించారు. బయట తమను చూసేందుకు జనాలు ఎగబడుతుండటంతో... అదే స్థాయిలో తమ సినిమాలకు కూడా ప్రేక్షకులు వస్తారని అనుకుంటుంటారని, అది సరికాదని చెప్పారు. తమ క్రేజ్ ని బట్టి కలెక్షన్లు వస్తాయనే భ్రమల నుంచి బయటపడాలని అన్నారు. ఓటీటీని దృష్టిలో పెట్టుకుని కొత్త యాక్టర్లను పరిచయం చేస్తే బాగుంటుందని చెప్పారు.

More Telugu News