Telangana: తెలంగాణకు హైదరాబాద్‌ కల్పతరువు లాంటిది: మంత్రి కేటీఆర్‌

  • దేశంలో ఏ నగరంలో లేనంత అభివృద్ధి హైదరాబాద్‌లో జరుగుతోందని వ్యాఖ్య
  • హైదరాబాద్‌ కొత్తగూడలో నిర్మించిన ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్
  • మూడేళ్లలో నగరానికి 3,500 ఎలక్ట్రిక్‌ బస్సులు తీసుకొస్తామన్న మంత్రి
For Telangana Hyderabad is like a dream come true says Minister KTR

దేశంలో ఏ నగరంలో లేనంత అభివృద్ధి హైదరాబాద్‌లో జరుగుతుందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. తమ ప్రభుత్వం ఏకకాలంలో అభివృద్ధి, సంక్షేమం లక్ష్యాలతో ముందుకెళుతోందని అన్నారు. ఎస్ ఆర్ డీపీలో భాగంగా హైదరాబాద్‌ కొత్తగూడలో నిర్మించిన ఫ్లైఓవర్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్‌ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రానికి హైదరాబాద్‌ నగరం కల్పతరువు వంటిందని అభిప్రాయపడ్డారు. 

ఎస్‌ఆర్‌డీపీ పథకం కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో దాదాపు 20 పూర్తి చేశామన్నారు. మరో 11 ప్రాజెక్టులను ఈ ఏడాది పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. మరో మూడేళ్లలో నగరానికి 3,500 ఎలక్ట్రిక్‌ బస్సులు తీసుకురానున్నామని అన్నారు. ఇక, రాష్ట్రంలో కరెంటు సమస్యను తీర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు. రాబోయే 50 ఏళ్లకు సరిపడేలా కాళేశ్వరం, సుంకిశాలను మంచినీటి సరఫరాకు ఏర్పాటు చేశామని వెల్లడించారు. గత వరదలను దృష్టిలో పెట్టుకుని స్ట్రాటజిక్‌ నాలా కార్యక్రమం చేపట్టామని, మార్చి, ఏప్రిల్‌ నాటికి ఈ కార్యక్రమం పూర్తిచేస్తామని ప్రకటించారు.

More Telugu News