RT PCR test: ఈ దేశాల నుంచి భారత్ కు వస్తే ఆర్టీపీసీఆర్ తప్పనిసరి

  • భారత్ కు బయల్దేరడానికి 72 గంటల ముందుగా ఆర్టీపీసీఆర్
  • పరీక్షా ఫలితం నివేదికతో రావాలంటూ మార్గదర్శకాలు
  • చైనా, హాంగ్ కాంగ్, జపాన్ సింగపూర్ తదితర దేశాల నుంచి వచ్చే వారికి అమలు
India makes RT PCR test mandatory for people travelling from these countries

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిని తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. చైనా, హాంగ్ కాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయిలాండ్  దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి.  

జనవరి 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. ఆయా దేశాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించి మార్గదర్శకాల్లో మార్పులు చేసింది. ప్రకటించిన ఈ దేశాల నుంచి వచ్చే వారు, నిర్ణీత ప్రయాణ సమయానికి 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్ష విధిగా చేయించుకుని, రిపోర్ట్ తో రావాల్సి ఉంటుంది. ఇక విదేశాల నుంచి వచ్చే మొత్తం ప్రయాణికుల్లో 2 శాతం మందికి ర్యాండమ్ గా ఇక్కడి విమానాశ్రయాల్లో నిర్వహించే ఆర్టీపీసీఆర్ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించింది.

More Telugu News