India: పంత్, అక్షర్ కూడా ఔట్.. ఇక అయ్యర్​పైనే ఆశలు

  • 145 పరుగుల లక్ష్య ఛేదనలో తీవ్ర తడబాటు
  • చెలరేగిపోతున్న బంగ్లా స్పిన్నర్లు మెహిదీ, షకీబ్
  • శ్రేయస్ అయ్యర్, అశ్విన్ పైనే ఆశలు
Mehidy traps Pant to open up the game

బంగ్లాదేశ్ తో రెండో టెస్టులో భారత జట్టు ఓటమికి ఎదురీదుతోంది. 145 పరుగుల లక్ష్య ఛేదనలో వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓవర్ నైట్ స్కోరు 45/4 స్కోరుతో నాలుగో రోజు, ఆదివారం ఛేదన కొనసాగించి భారత్ కు బంగ్లా స్పిన్నర్లు మెహిదీ హసన్, షకీబ్ హసన్ షాకిచ్చారు. ఆట మొదలైన వెంటనే ఉనాద్కట్ (13)ను షకీబ్ ఔట్ చేశాడు. 

ఆ వెంటనే భారీ అంచనాలున్న రిషబ్ పంత్ (9)తో పాటు క్రీజులో కుదురుకున్న అక్షర్ పటేల్ (34)ను మెహిదీ హసన్ పెవిలియన్ చేర్చడంతో భారత్ 74/7తో ఓటమి ముంగిట నిలిచింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్, అశ్విన్ జట్టును ఆదుకుంటున్నారు. షకీబ్, మెహిదీ హసన్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. దాంతో, 42 ఓవర్లకు భారత్ 111/7 స్కోరుతో నిలిచింది. అయ్యర్ 26, అశ్విన్ 11 పరుగులతో ఉన్నారు. భారత్ కు ఇంకా 34 పరుగులు కావాలి.

More Telugu News