Team India: బంగ్లాదేశ్ బౌలింగ్ విలవిల... భారత్ 50 ఓవర్లలో 409-8

  • మూడో వన్డేలో భారత్ అతి భారీ స్కోరు
  • ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ
  • కోహ్లీ సెంచరీ.. బంగ్లా ముందు భారీ లక్ష్యం
Team India posts huge total against Bangladesh

ఛట్టోగ్రామ్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో టీమిండియా అతి భారీ స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ, కోహ్లీ సెంచరీ సాయంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 409 పరుగులు చేసింది. 

బంగ్లా బౌలింగ్ ను చీల్చి చెండాడుతూ ఇషాన్ కిషన్ 131 బంతుల్లో 210 పరుగులు చేయగా, కోహ్లీ తన క్లాస్ టచ్ రుచి చూపిస్తూ 91 బంతుల్లో 113 పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ 37, అక్షర్ పటేల్ 20 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2, షకీబల్ హసన్ 2, ఇబాదత్ హుస్సేన్ 2, ముస్తాఫిజూర్ రెహ్మాన్ 1, మెహిదీ హసన్ 1 వికెట్ తీశారు. 

పిచ్ బ్యాటింగ్ కు స్వర్గధామంలా మారిన నేపథ్యంలో, అతి భారీ లక్ష్యఛేదనలో బంగ్లా ఆటగాళ్లు ఎలా ఆడతారన్నది ఆసక్తి కలిగిస్తోంది.

More Telugu News