Team India: బంగ్లాదేశ్​ పై భారీ సెంచరీతో చెలరేగిపోతున్న భారత యువ క్రికెటర్

  • రోహిత్ శర్మ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్
  • ఫోర్లు, సిక్సర్లతో విజృంభిస్తున్న వైనం
  • భారీ స్కోరు దిశగా భారత్
ishan kishan smashesh century

బంగ్లాదేశ్ తో మూడో వన్డేలో భారత్ బ్యాటింగ్ లో దంచికొడుతోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగుకు వచ్చిన బారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. డ్రింక్స్ విరామ సమయానికి 31 ఓవర్లలో ఒకే వికెట్ నష్టానికి 257 పరుగులు చేసింది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్ మరోసారి నిరాశ పరిచాడు. ఇన్నింగ్స్ ఆరంభించిన అతను 8 బంతుల్లో మూడే పరుగులు చేశాడు. ఐదో ఓవర్లోనే స్పిన్నర్ మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. 

అయితే, రోహిత్ శర్మ స్థానంలో మరో ఓపెనర్ గా బరిలోకి దిగిన యువ క్రికెటర్ ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. కోహ్లీ సహకారంతో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. ఈ క్రమంలో 49 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఇషాన్ 85 బంతుల్లోనే సెంచరీ మార్కు దాటాడు. ఆ తర్వాత మరింత చెలరేగిపోయాడు. 103 బంతుల్లోనే 150 మార్కు అందుకొని భారత స్కోరు 250 దాటించాడు. కోహ్లీ సైతం 54 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరి జోరు చూస్తుంటే భారత్ సులభంగా 420–450 పరుగులు చేసేలా ఉంది.

More Telugu News