YS Sharmila: షర్మిల దీక్ష భగ్నం.. అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించిన పోలీసులు

  • ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమరణ దీక్ష
  • దీక్షకు అనుమతి లేదంటూ అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • కేసీఆర్ పతనానికి ఇదే నాంది అన్న షర్మిల
Sharmila lifted from hunger strike

తన పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్షకు అనుమతి లేదంటూ ఆమెను అడ్డుకున్నారు. ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు దీక్షలో కూర్చున్న షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి పోలీసు వాహనంలో ఆమెను బలవంతంగా తరలించారు. అడ్డుకునేందుకు యత్నించిన కార్యకర్తలను పక్కకు తోసేసి ఆమెను తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కేసీఆర్ మరోసారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. కేసీఆర్ పదేపదే తప్పు చేస్తున్నారని... ఆయన పతనానికి ఇదే నాంది అని అన్నారు. మరోవైపు షర్మిలపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు చెపుతున్నారు.

More Telugu News