KCR: బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్.. నేడు దివ్య ముహూర్తంలో ఆవిర్భావ సభ, జెండా ఆవిష్కరణ

  • టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ కేసీఆర్ కు ఈసీ లేఖ
  • ఈ మధ్యాహ్నం 1.20 గంటలకు బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం
  • బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించనున్న కేసీఆర్
KCR to hoist BRS flag today

తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్ గా కొనసాగనుంది. తెలంగాణ రాష్ట్ర సమితి భారత్ రాష్ట్ర సమితిగా మారింది. పార్టీ పేరును మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ రాసింది. ఈ శుభ సందర్భాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకోనున్నాయి. 

ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం 1.20 గంటలకు దివ్య ముహూర్తంలో బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన లేఖపై కేసీఆర్ సంతకం చేయనున్నారు. ఆ మరుక్షణమే బీఆర్ఎస్ పార్టీ ఉనికిలోకి వస్తుంది. టీఆర్ఎస్ కనుమరుగు అవుతుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. కార్యక్రమం అనంతరం పార్టీ కార్యాచరణపై కీలక నేతలతో కేసీఆర్ చర్చిస్తారు. 

మరోవైపు ఈ మధ్యాహ్నం జరగనున్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డీసీసీబీ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యలంతా హాజరుకానున్నారు. ముహూర్త సమయంలోగానే అందరూ తెలంగాణ భవన్ కు చేరుకోవాలని అందరికీ కేసీఆర్ పేరిట లేఖలు వెళ్లాయి. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా అవతరించనున్న నేపథ్యలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ బ్యానర్లు వెలిశాయి.

More Telugu News