G Jagadish Reddy: తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలవడం అనేది తెలివి తక్కువ వాదన: తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి

  • ఉమ్మడి రాష్ట్రం తమ విధానం అన్న సజ్జల
  • మీడియా సంచలనాల కోసమేనన్న జగదీశ్ రెడ్డి   
  • చరిత్రను వెనక్కి తిప్పలేరని స్పష్టీకరణ
Telangana minister Jagadish Reddy reacts to Sajjala comments

రెండు తెలుగు రాష్ట్రాలు కలిసిపోతే మొదట స్వాగతించేది వైసీపీయేనని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. విడిపోయిన రాష్ట్రాలు మళ్లీ కలవడం అనేది తెలివి తక్కువ వాదన అని స్పష్టం చేశారు. 

ఒకవేళ సజ్జల చెప్పినట్టే జరిగితే ఏపీ తమకు కావాలని మద్రాస్ వాళ్లు కూడా అడగొచ్చని, భారతదేశం తమకు కావాలని ఇంగ్లండ్ మళ్లీ అడగొచ్చని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇవన్నీ అర్థం లేని వాదనలని, మీడియా సంచలనాల కోసం తప్ప ఈ వాదనలో ప్రయోజనంలేదని హితవు పలికారు. చరిత్రను వెనక్కి తిప్పడం ఎవరి వల్ల కాదని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. 

నాడు తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రాను బలవంతంగా కలిపారని, 60 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం తనను తాను ఆవిష్కరించుకుందని పేర్కొన్నారు.

More Telugu News