electricity bill: విద్యుత్ బిల్లు ప్రతి నెలా మీరు చెల్లించక్కర్లేదు.. పేటీఎంలో ఆటో పే ఆప్షన్

  • పేటీఎంలో అకౌంట్ ఉంటే చాలు
  • యాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి రీచార్జ్ అండ్ బిల్ పేమెంట్స్ ఎంపిక చేసుకోవాలి
  • అన్ని వివరాలు ఇవ్వడం ద్వారా నమోదు చేసుకోవచ్చు
Miss paying your electricity bill every month Heres how you can set up autopay on Paytm

ప్రతి నెలా విద్యుత్ బిల్లు, ఫోన్ బిల్లు, డిష్ బిల్లు చెల్లించడం తప్పనిసరి. మొబైల్ రీచార్జ్ అయినా, డిష్ టీవీ అయినా మనకు రిమైండర్ సందేశాలు వస్తుంటాయి. కానీ ఎలక్ట్రిసిటీ విభాగం నుంచి ఇలా గుర్తు చేసే సందేశాలు ఏవీ రావు. మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని ప్రతి నెలా మనం గుర్తుంచుకుని చెల్లించే ఇబ్బంది లేకుండా పేటీఎంలో ఆటో పే ఆప్షన్ ఉంది. దీన్ని సెలక్ట్ చేసుకుంటే ప్రతి నెలా బిల్లు జారీ అయిన తర్వాత చెల్లింపులు జరిగిపోతాయి. తిరిగి వద్దనుకుంటే ఈ ఆటోపే ఆప్షన్ ను ఆఫ్ చేసుకోవచ్చు.


  • ముందుగా పేటీఎం లో అకౌంట్ లేని వారు, యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని, మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీ ద్వారా సులభంగా క్రియేట్ చేసుకోవచ్చు. 
  • పేటీఎం యాప్ తెరిచి అందులో సెట్టింగ్స్ కు వెళ్లాలి. రీచార్జ్ అండ్ బిల్ పేమెంట్స్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. 
  • ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి.
  • రాష్ట్రం, ఎలక్ట్రిసిటీ బోర్డును ఎంపిక చేసుకోవాలి. 
  • కస్టమర్ ఐడెంటిఫికేషన్ నంబర్(సీఏ) ను నమోదు చేయాలి. తర్వాత మొబైల్ నంబర్ ఇచ్చి ప్రొసీడ్ ను క్లిక్ చేయాలి. 
  • అన్ని వివరాలు ఇచ్చిన తర్వాత యూపీఐ ఆటోపే ను ఎంపిక చేసుకోవాలి. 
  • చివరిగా యూపీఐ పిన్ ఇచ్చినట్టయితే లావాదేవీ నమోదవుతుంది.

More Telugu News