Kangana Ranaut: 'చంద్రముఖి 2'ను ప్రారంభించిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్

  • 'చంద్రముఖి' చిత్రానికి సీక్వెల్
  • పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం
  • ఆపోజిట్ లీడ్ రోల్ లో రాఘవ లారెన్స్
Kangana Ranaut started Chandramukhi 2

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కొత్త చిత్రం 'చంద్రముఖి 2' షూటింగ్ ప్రారంభమయింది. ఈ విషయాన్ని కంగన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'చంద్రముఖి 2' షూటింగ్ ను ప్రారంభించామని తెలిపింది. ఈ చిత్రంలో రాజు సభలో ఒక అందమైన నర్తకి పాత్రను కంగన పోషిస్తోంది. కంగనకు ఆపోజిట్ లీడ్ రోల్ లో తమిళ నటుడు రాఘవ లారెన్స్ నటిస్తున్నాడు. పి.వాసు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రజనీకాంత్, జ్యోతిక, ప్రభు తదితరులు నటించిన 'చంద్రముఖి' సినిమాకు ఈ చిత్రం సీక్వెల్ గా రానుంది. 

మరోవైపు తన మరో చిత్రం 'ఎమర్జెన్సీ' అసోం షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జీవితం, ఎమర్జెన్సీ నాటి పరిణామాల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఆమె ఇందిర పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, వైశాఖ్ నాయర్, శ్రేయస్ తల్పాడే తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు కంగననే దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం.

More Telugu News