Rishabh Shetty: తెలుగులో 50 రోజులను పూర్తి చేసుకున్న 'కాంతార'

  • రిషభ్ శెట్టి హీరోగా రూపొందిన 'కాంతార'
  • తెలుగులో అక్టోబర్ 15న విడుదలైన సినిమా
  • ఈ రోజుతో 50 రోజులు పూర్తి
  • కథా కథనాలే ప్రధాన బలంగా నిలిచిన సినిమా 
  • ఓటీటీ వైపు నుంచి కూడా భారీ రెస్పాన్స్  
Kantara Movie

కన్నడ మాతృకగా విడుదలైన 'కాంతార' అక్కడ కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. అంతవరకూ అక్కడ రిషబ్ శెట్టికి హీరోగా .. దర్శకుడిగా ఓ మాదిరి క్రేజ్ మాత్రమే ఉండేది. అలాంటి ఆయన క్రేజ్ ను అమాంతం పెంచేసిన సినిమా 'కాంతార'. సెప్టెంబర్ 30వ తేదీన అక్కడ విడుదలైన ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చినా థియేటర్లలో ఉండటం విశేషం. 

తెలుగులో ఈ సినిమాను అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. అక్టోబర్ 15వ తేదీన ఇక్కడ థియేటర్లలో దిగిపోయిన ఈ సినిమా, తొలి రోజునే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తరువాత నుంచి చాలా రోజుల పాటు అదే వసూళ్ల జోరును కొనసాగించింది. మంచి లాభాలను తెచ్చిపెట్టింది. 

అలాంటి ఈ సినిమా తెలుగులో ఈ రోజుతో 50 రోజులను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా కొంతసేపటి క్రితం అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. అడవి ప్రాంతంలోని ఆచార విశ్వాసాలకు సంబంధించిన కథనే అయినా, మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా .. సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించడమే ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించడానికి ప్రధానమైన కారణమని చెప్పుకోవచ్చు.

More Telugu News