Savitri: అమ్మను చూసి నేర్చుకున్నది అదే: సావిత్రి కూతురు

  • సావిత్రిని గురించి ప్రస్తావించిన కూతురు 
  • తల్లి ఆరోగ్యం దెబ్బతినడం గురించి వివరణ 
  • తమని పట్టించుకునే స్థితిలో ఉండేది కాదని వ్యాఖ్య 
  • ఆమె కూతురుగా గర్వపడుతూనే ఉంటానని వెల్లడి 
Vijaya Chamundeshwary Interview

మహానటి సావిత్రికి అభిమానులు కానివారంటూ ఎవరూ ఉండరు. అలాంటి వాళ్లంతా ఆమెను గురించిన విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని చూపుతూనే ఉంటారు. తాజా ఇంటర్వ్యూలో సావిత్రి గురించిన అనేక సంగతులను ఆమె కూతురు విజయ చాముండేశ్వరి ప్రస్తావించారు. 

" మా చిన్నప్పుడు మా అమ్మ మమ్మల్ని పట్టించుకునే స్థితిలో ఉండేది కాదు. ఏదైనా చెబితే విని బాధపడేది కానీ, తన పద్ధతిని మార్చుకునేది కాదు. తన ఆరోగ్యం దెబ్బతింటుందని తెలియగానే దగ్గరి బంధువుతో నా పెళ్లి జరిపించేసింది. చివరి రోజుల్లో ఆమె మద్యానికి అలవాటు పడినా ఆమె కూతురినని చెప్పుకోవడానికి నేను గర్వపడుతూనే ఉంటాను" అన్నారు. 

"అమ్మను చూసిన తరువాత స్త్రీలు మానసికంగా బలంగా ఉండాలనే విషయం నాకు అర్థమైంది. అలాగే ఎప్పుడూ ఫిట్ నెస్ పై .. ఆరోగ్య విషయాలపై దృష్టి పెట్టాలనే విషయం తెలుసుకున్నాను. అందుకు సంబంధించిన కోర్సులు చేశాను. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో నా చుట్టూ ఉన్నవారిని గైడ్ చేస్తూ వెళుతున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News