Tortoise: తాబేళ్లు అన్నింటికీ పెద్దన్న ఈ తాబేలు

  • పేరు జోనాథన్.. వయసు 190 ఏళ్లు.. గిన్నిస్ రికార్డుల్లో పేరు నమోదు
  • సెయింట్ హెలెనా దీవిలో గవర్నర్ గారి బంగ్లాలో నివాసం
  • బాగోగులు చూడడానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించిన గవర్నర్
Worlds Oldest Tortoise Jonathan Turns 190

ప్రపంచంలో ఇప్పుడు జీవించి ఉన్న తాబేళ్లు అన్నింటికీ పెద్దన్నలాంటిది ఈ తాబేలు. దీని వయసు 190 ఏళ్లు.. బ్రిటీష్ పాలనలో ఉన్న సెయింట్ హెలెన్ దీవి ఈ తాబేలు నివాసం.. చిన్న కొలనులోనో లేక జూలోనే ఉంటోందని అనుకుంటే పొరపాటే.. ఏకంగా గవర్నర్ అధికారిక భవనమే ఈ తాబేలు కేరాఫ్ అడ్రస్. దీనికి తోడుగా ఉండేందుకు అధికారులు ఓ ఆడ తాబేలును కూడా తీసుకొచ్చారు. దీని బాగోగులు చూసేందుకు ప్రత్యేకంగా సిబ్బంది ఉన్నారు. నెపోలియన్ కాలంలో.. అంటే నెపోలియన్ చనిపోయినపుడు పుట్టిన ఈ తాబేలు దేశాలు దాటొచ్చి ఈ దీవిలో స్థిరపడింది. 

సీచెల్స్ జాతికి చెందిన ఈ భారీ తాబేలుకు అధికారులు జోనాథన్ అని పేరు పెట్టారు. భూమి మీద ఇప్పుడు బతికి ఉన్న జంతువుల జాతిలో ఎక్కువ వయసున్న తాబేలుగా జోనాథన్ గిన్నిస్ రికార్డులలోకి ఎక్కాడు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలతో పాటు బ్రిటీష్ సామ్రాజ్యం ఏర్పాటు నుంచి పతనం దాకా అన్ని సంఘటనలకూ జోనాథన్ సాక్షిగా ఉన్నాడని దీని బాగోగులు చూసుకునే ప్రధాన కేర్ టేకర్ జో హాలిన్స్ చెప్పారు. బ్రిటన్ రాజులు, రాణుల పాలనను చూసిందన్నారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తమ్మీద ఉన్న సీచెల్స్ తాబేళ్ల సంఖ్య కేవలం 80 నుంచి 100 లోపేనని అధికారులు చెబుతున్నారు.

More Telugu News