K Kavitha: సీబీఐ నోటీసులపై కవిత స్పందన

  • ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో కవిత పాత్ర ఉందని ఆరోపణలు
  • ఈ నెల 6వ తేదీన విచారణకు హాజరు కావాలన్న సీబీఐ
  • హైదరాబాద్ లో తన నివాసంలో విచారణకు హాజరవుతానన్న కవిత
Kavitha response on CBI notice

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. మిమ్మల్ని విచారించడానికి మీకు అనుకూలంగా ఉండే నివాసం (హైదరాబాద్ లేదా వీలైనంత వరకు ఢిల్లీ) ఏదో చెప్పాలని కోరింది. ఈ నోటీసులపై కవిత స్పందించారు. తనకు సీబీఐ నోటీసులు అందాయని... విచారణకు సహకరిస్తానని చెప్పారు. వారి అభ్యర్థన మేరకు హైదరాబాద్ లోని తన నివాసంలో తనను ప్రశ్నించాలని సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చానని తెలిపారు. 

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో కవిత పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఆ పాలసీని రూపొందించే సమయంలో ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్ లో జరిగిన సమావేశాల్లో కవిత పాల్గొన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ వ్యవహారంలో కవిత పాత్ర ఎంత మేరకు ఉందనే విషయంపై సీబీఐ ప్రశ్నించనుంది.

More Telugu News