India: విలువలో రిలయన్సే నంబర్ వన్.. అదానీ ఎంటర్ ప్రైజెస్ కు పదో స్థానం

  • భారత్ లో అత్యధిక విలువ ఉన్న కంపెనీల్లో రిలయన్స్ కు అగ్రస్థానం
  • రూ. 17.25 లక్షల కోట్ల విలువ ఉన్నట్టు '2022 బుర్తుండి ప్రైవేట్ హురున్ ఇండియా 500’ జాబితా వెల్లడి
  • రూ. 11.68 లక్షల కోట్లతో రెండో స్థానంలో నిలిచిన టీసీఎస్
Mukesh Ambanis Reliance Industries Tops Indias Most Valuable Firms List

ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ భారతదేశంలో అత్యంత విలువైన సంస్థల జాబితాలో మొదటి స్థానం సాధించింది. మార్కెట్ విలువ ఆధారంగా దేశంలోనే అత్యంత విలువైన లిస్టెడ్ సంస్థగా ఉంది. ఈ మేరకు '2022 బుర్తుండి ప్రైవేట్ హురున్ ఇండియా 500’ జాబితాలో రిలయన్సే తొలిస్థానంలో నిలిచింది. ఈ జాబితాలోని కంపెనీల మొత్తం విలువ రూ. 226 లక్షల కోట్లుగా ఉంది. 

ఇక భారతదేశం నుంచి 500 అత్యుత్తమ విలువైన కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ రూ. 17.25 లక్షల కోట్లుగా వెల్లడించింది. రిలయన్స్ తర్వాతి స్థానంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉండగా, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ మూడో స్థానంలో నిలిచింది. టీసీఎస్ విలువ రూ. 11.68 లక్షల కోట్లుగా ఉంది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ విలువ రూ. 8.33 లక్షల కోట్లుగా ఉన్నట్లు బర్తుండి నివేదిక పేర్కొంది.

ఇన్ఫోసిస్ రూ. 6.33 లక్షల కోట్ల విలువతో నాలుగో స్ధానం దక్కించుకుంది. ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 6.33 లక్షల కోట్లతో ఐదో స్థానంలో నిలిచింది. భారతీ ఎయిర్ టెల్ (రూ.4.89 లక్షల కోట్లు) , హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(రూ.4.48 లక్షల కోట్లు), ఐటీసీ(రూ.4.32 లక్షల కోట్లు), అదానీ టోటల్ గ్యాస్ (రూ.3.96 లక్షల కోట్లు), అదానీ ఎంటర్ ప్రైజెస్(రూ.3.81 లక్షల కోట్లు) తర్వాతి స్థానాలతో టాప్10లో చోటు దక్కించుకున్నాయి. '2022 బుర్గుండి ప్రైవేట్ హురున్ ఇండియా 500' జాబితాలో చోటు దక్కాలంటే కంపెనీల కనీస విలువ రూ. 6,000 కోట్లు ఉండాలి. ఇది 725 యూఎస్ మిలియన్ల డాలర్లకు సమానం.

More Telugu News