Telangana: తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల

  • నోటిఫికేషన్ ను విడుదల చేసిన టీఎస్పీఎస్సీ
  • మొత్తం 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడి
  • ఈ నెల 23 నుంచి జనవరి 12 దాకా దరఖాస్తులకు అవకాశం
  • ఏప్రిల్ లేదా మే నెలల్లో పరీక్ష నిర్వహణ
tspsc issues group 4 notification

తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపుగా 60 వేలకు పైగా ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కాగా... వాటి భర్తీ వివిధ దశల్లో కొనసాగుతోంది. తాజాగా రాష్ట్రంలోని నిరుద్యోగులకు టీఆర్ఎస్ సర్కారు మరో తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న 9,168 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా జారీ అయిన ఈ నోటిఫికేషన్ కు ఈ నెల 23 నుంచి జనవరి 12 దాకా దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ పరీక్ష తేదీలను వెల్లడించని అధికారులు... పరీక్షను వచ్చే ఏడాది ఏప్రిల్ లేదంటే మే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

More Telugu News