flavonoids: ఫ్లావనాయిడ్స్ ఉన్న ఆహారంతో గుండెకు రక్షణ

  • వయసులో ఉన్నప్పటి నుంచి తీసుకోవడం మంచిది
  • అబ్డామినల్ ఆరోటిక్ కాల్సిఫికేషన్ రిస్క్ తగ్గుతుంది
  • గుండె జబ్బులు, కేన్సర్ రిస్క్ నుంచి రక్షణ
How Black Tea Apples and Cruciferous Veggies Benefit Heart Health Later In Life

ఫ్లావనాయిడ్స్ అధికంగా ఉండే టీ, పండ్లు, క్రూసిఫెరోస్ కూరగాయలతో గుండెకు మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఫ్లావనాయిడ్స్ ఉన్న మొక్కల ఆధారిత ఆహారాన్ని వయసులో ఉన్నప్పటి నుంచి తీసుకుంటే, వృద్ధాప్యంలో అబ్డామినల్ అరోటిక్ కాల్సిఫికేషన్ (ఏఏసీ) రిస్క్ చాలా వరకు తగ్గుతుందని ఎడిత్ కోవాన్ యూనివర్సిటీ పరిశోధకులు తెలుసుకున్నారు. ఈ వివరాలు ఆర్టియోస్కెలరోసిస్, థ్రాంబోసిస్, వాస్క్యులర్ బయోలజీ అనే జర్నల్ లో ప్రచురితమయ్యాయి.

అబ్డామినల్ అరోటా (పొత్తికడుపు బృహద్ధమని)లో క్యాల్షియం నిల్వలు పేరుకుపోవడాన్ని ఏఏసీగా చెబుతారు. గుండె నుంచి కడుపులోని భాగాలకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన బాధ్యతను బృహద్ధమనే చూస్తుంటుంది. ఏఏసీ ఉన్న వారికి గుండె పోటు, స్ట్రోక్, డిమెన్షియా ముప్పు ఉంటుంది. మొక్కల నుంచి వచ్చే ఫ్లావనాయిడ్స్ తో కూడిన ఆహారం, తినడం వల్ల గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుందని ఎన్నో పరిశోధనలు తేల్చాయని, అందులో తమ అధ్యయనం కూడా ఒకటని డైటీషియన్ జానీస్ ఫ్రిస్ వరల్డ్ తెలిపారు. ఫ్లావనాయిడ్స్ కేన్సర్ రిస్క్ ను కూడా తగ్గిస్తాయని మరికొన్ని అధ్యయనాలు పేర్కొనడం గమనార్హం. 

ఫ్లావనాయిడ్స్ అన్నది ఓ రకమైన కాంపౌండ్. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ మన శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంటాయి. కణాలు దెబ్బతినకుండా చూస్తాయి. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఆరువేలకు పైగా ఫ్లావనాయిడ్స్ ను గుర్తించారు. వాటిని 12 గ్రూపులుగా వర్గీకరించారు. 

బెర్రీలు, ద్రాక్ష, ఎర్ర క్యాబేజీలో యాంతోసైనిడిన్స్ ఉన్నాయి. బ్లాక్ టీ, వైన్, డార్క్ చాక్లెట్లు, అప్రికాట్, యాపిల్, బెర్రీ, ద్రాక్షలో ఫ్లావిన్ 3 ఓఎల్ఎస్ అనే రకం ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. ఇక టీ, బెర్రీలు, యాపిల్స్, ఉల్లి గడ్డలు, బ్రొకోలీ, కాలే, పాలకూరలో ఫ్లావనాల్స్ ఉంటాయి. చిల్ పెప్పర్, మింట్, ఆకుకూరల్లో ఫ్లావోన్స్ ఉంటాయి. సిట్రస్ పండ్లు అయిన నిమ్మ, ఆరెంజ్, ద్రాక్షలో ఫ్లావనోన్స్ ఉంటాయి. బీన్స్, లెంటిల్స్, పీస్, సోయా ఉత్పత్తుల్లో ఐసోఫ్లావోన్స్ ఉంటాయి. 

More Telugu News