Kaluva Srinivasulu: టీడీపీ నేత కాలువ శ్రీనివాసులును అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • అనంతపురం జిల్లాలో వేడెక్కిన రాజకీయాలు
  • చంద్రబాబు, లోకేశ్ లపై వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు
  • కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేత బత్తలపల్లి జగ్గు
  • జగ్గును అరెస్ట్ చేసిన పోలీసులు
  • పోలీస్ స్టేషన్ ముందు పరిటాల సునీత ఆందోళన
  • సునీతకు మద్దతుగా కదిలిన కాలువ శ్రీనివాసులు
Police house arrests TDP leader Kaluva Srinivasulu

టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ లపై వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చందు తీవ్ర వ్యాఖ్యలు చేయగా, అనంతపురం జిల్లా టీడీపీ నేత జగ్గు కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. అయితే పోలీసులు జగ్గును అరెస్ట్ చేయగా, మాజీ మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో టీడీపీ నేతలు చెన్నే కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. 

ఈ నేపథ్యంలో, ఆందోళన చేపట్టిన తమ పార్టీ శ్రేణులకు మద్దతుగా టీడీపీ సీనియర్ నేత కాలువ శ్రీనివాసులు చెన్నే కొత్తపల్లి బయల్దేరారు. అయితే ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. రాయదుర్గంలో కాలువ శ్రీనివాసులును నిలువరించిన పోలీసులు ఆయనను స్థానిక టీడీపీ ఆఫీసులో గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా పోలీసులపై కాలువ శ్రీనివాసులు మండిపడ్డారు. 

పోలీసుల తీరును గర్హిస్తూ కనేకల్ రోడ్డుపై తన అనుచరులతో కలిసి బైఠాయించారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పోలీసులు కాలువ శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని రాయదుర్గంలోని ఆయన నివాసానికి తరలించారు.

More Telugu News