tdp: టీడీపీ నేత కోటంరెడ్డిపై కారుతో దాడి

  • తృటిలో తప్పిన ప్రమాదం.. గాయాలపాలైన కోటంరెడ్డి
  • ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు
  • కాలు ఫ్యాక్చర్ అయినట్లు వెల్లడించిన వైద్యులు
  • దాడిని తీవ్రంగా ఖండించిన పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
Nellore TDP in charge Kotamreddy hit Srinivas with a car

తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులుపై దాడి జరిగింది. నగరంలోని ఆయన ఇంటి సమీపంలో రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు తన కారుతో శ్రీనివాసులును ఢీ కొట్టాడు. ఈ ఘటనలో గాయాలపాలైన శ్రీనివాసులును కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. ఈ దాడిని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిస్తూ.. దాడికి పాల్పడ్డ రాజశేఖర్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

కోటంరెడ్డి శ్రీనివాసులు కుమారుడు ప్రజయ్, రాజశేఖర్ రెడ్డి స్నేహితులు.. చాలా రోజుల తర్వాత రాజశేఖర్ రెడ్డి ప్రజయ్ ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో ప్రజయ్ తో గొడవపడ్డాడు. శ్రీనివాసులు కల్పించుకుని రాజశేఖర్ రెడ్డికి సర్దిచెప్పి పంపించారు. బయటకు వెళ్లినట్లే వెళ్లి వేచి చూసిన రాజశేఖర్ రెడ్డి.. శ్రీనివాసులు బయటకు రాగానే తన కారుతో ఢీ కొట్టి పారిపోయాడు. గాయపడిన శ్రీనివాసులును కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కోటంరెడ్డిని పరీక్షించిన వైద్యులు.. ఆయన కాలుకు ఫ్యాక్చర్ అయినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రాజశేఖర్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. 

కోటంరెడ్డి శ్రీనివాసులుపై దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. జగన్ రెడ్డి గారి మూడు రాజధానులకు తోడు క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా నెల్లూరును ప్రకటించినట్టు ఉందని విమర్శించారు. దాడికి పాల్పడిన వైసీపీ సానుభూతిపరుడు సైకో రాజశేఖరరెడ్డిని కఠినంగా శిక్షించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

More Telugu News