Team New Zealand: భారత్‌తో రెండో వన్డే: మళ్లీ న్యూజిలాండ్‌దే టాస్.. రెండు మార్పులతో బరిలోకి భారత్

  • మైదానం చిత్తడిగా ఉండడంతో టాస్ ఆలస్యం
  • భారత్‌కు బ్యాటింగ్ అప్పగించిన కివీస్
  • శార్దూల్ ఠాకూర్, సంజు శాంసన్ అవుట్
  • దీపక్ చాహర్, దీపక్ హుడాలు ఇన్
Kiwis Won the toss and opt bowl first in 2nd One Day

టీమిండియాతో హమిల్టన్‌లో జరగనున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మైదానం చిత్తడిగా ఉండడంతో టాస్ కొంత ఆలస్యమైంది. వర్షం పడే అవకాశం 90 శాతం ఉన్నట్టు వాతావరణశాఖ చెబుతుండడంతో ఈ మ్యాచ్ కొనసాగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఆక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 300 పైచిలుకు పరుగులు సాధించినప్పటికీ కివీస్ అలవోకగా సాధించి జయకేతనం ఎగరవేసింది. దీంతో రెండో వన్డేలో విజయం సాధించడం ద్వారా తిరిగి పట్టు సాధించాలని ధావన్ సేన భావిస్తోంది. 

ఈ మ్యాచ్‌లో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. శార్దూల్ ఠాకూర్‌కు బదులుగా దీపక్ చాహర్, సంజు శాంసన్‌కు బదులుగా దీపక్ హుడాలకు తుది జట్టులో చోటు లభించింది. తొలి వన్డేలో భారత బౌలర్లు వికెట్లు తీయడానికి చెమటోడ్చిన నేపథ్యంలోనే ఈ రెండు మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ఇక, న్యూజిలాండ్ జట్టులో ఆడం మిల్నే స్థానంలో మైఖేల్ బ్రాస్‌వెల్ జట్టులోకి వచ్చాడు.

More Telugu News