Group-4: నిరుద్యోగులకు శుభవార్త... తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాల జాతర

  • 9,168 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి
  • ట్విట్టర్ లో వెల్లడించిన మంత్రి హరీశ్ రావు
  • నాలుగు కేటగిరీల్లో గ్రూప్-4 పోస్టులు
  • టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్నట్టు హరీశ్ వెల్లడి
Telangana govt announced huge number of posts

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్-4 ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయని మంత్రి హరీశ్ రావు తియ్యని కబురు చెప్పారు. మొత్తం 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఈ ఉద్యోగాలను టీఎస్ పీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేస్తుందని హరీశ్ రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చుతున్నారని, అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

గ్రూప్-4 ఉద్యోగ ఖాళీల వివరాలు...

నాలుగు కేటగిరీల్లో గ్రూప్-4 ఉద్యోగాలు
జూనియర్ అసిస్టెంట్ పోస్టులు- 6,859
వార్డు ఆఫీసర్ పోస్టులు- 1,862
జూనియర్ అకౌంటెంట్ పోస్టులు- 429
జూనియర్ ఆడిటర్ పోస్టులు- 18

More Telugu News