unemployment rate: పట్టణాల్లో తగ్గిన నిరుద్యోగం.. తాజా గణాంకాల విడుదల

  • సెప్టెంబర్ త్రైమాసికంలో 7.2 శాతానికి పరిమితం
  • అంతకుముందు మూడు నెలల కాలంలో ఇది 7.6 శాతం
  • పురుషుల కంటే మహిళల్లో నిరుద్యోగం ఎక్కువ
Urban unemployment improved to best level in July September

సెప్టెంబర్ త్రైమాసికంలో దేశంలోని పట్టణ ప్రాంతాలలో నిరుద్యోగం తగ్గినట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్ వో) తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ కాలానికి సంబంధించి నిరుద్యోగ గణాంకాలను విడుదల చేసింది. పట్టణాల్లో నిరుద్యోగం సెప్టెంబర్ త్రైమాసికంలో 7.2 శాతంగా ఉంది. అంతకు ముందు మూడు నెలల్లో (ఏప్రిల్-జూన్) ఉన్న 7.6 శాతంతో పోలిస్తే 0.40 శాతం తగ్గింది. కరోనా ముందు సంవత్సరం 2019 సెప్టెంటర్ క్వార్టర్ లో ఉన్న 8.4 శాతం నిరుద్యోగ రేటుతో పోల్చిచూసినా.. 1.2 శాతం మేర నిరుద్యోగిత తగ్గింది. 

ఈ రేటు ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఆర్థిక కార్యకలాపాలు, డిమాండ్ కు తగ్గట్టు నిరుద్యోగం మారిపోతుంటుంది. 39.7 శాతం మంది సొంత కాళ్లపై (స్వయం ఉపాధి) నిలబడగా, క్యాజువల్ వర్కర్ల శాతం 11.6 శాతంగా నమోదైంది. వ్యవసాయ రంగ కార్మికుల శాతం 5.9 నుంచి 5.7కు తగ్గింది. 15 ఏళ్లు నిండి, పనిచేసే సామర్థ్యం ఉన్న వారి గణాంకాల ఆధారంగా నిరుద్యోగాన్ని అంచనా వేస్తుంటారు. పురుషుల్లో నిరుద్యోగులు 6.6 శాతంగా ఉంటే, మహిళల్లో నిరుద్యోగ రేటు 9.4 శాతంగా ఉంది. గతేడాది ఇదే కాలంలో ఇవి వరుసగా 9.3 శాతం, 11.6 శాతం చొప్పున ఉన్నాయి.

More Telugu News