Patanjali: బాబా రాందేవ్ 'పతంజలి' పేరుపై వివాదం

  • పతంజలి బ్రాండ్ తో వ్యాపారం
  • బాబా రాందేవ్, ఎండీ బాలకృష్ణలపై బీజేపీ ఎంపీ ఆగ్రహం
  • యోగా పితామహుడు పతంజలి పేరు వాడుకోవడం సరికాదని హితవు
Controversy on Patanjali brand name

ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ పతంజలి బ్రాండ్ పై వివిధ ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తుండడం తెలిసిందే. అయితే పతంజలి పేరుపై తాజాగా వివాదం నెలకొంది. బాబా రాందేవ్, పతంజలి గ్రూప్ ఎండీ బాలకృష్ణలపై బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ధ్వజమెత్తారు. 

మహర్షి పతంజలిని యోగా విజ్ఞాన పితామహుడిగా భావిస్తారని, అటువంటి మహోన్నత వ్యక్తి పేరును వ్యాపార ప్రయోజనాలకు వాడుకోవడం సరికాదని శరణ్ సింగ్ పేర్కొన్నారు. బాబా రాందేవ్, బాలకృష్ణ వెంటనే వారి బ్రాండ్ కు పతంజలి పేరు తొలగించాలని డిమాండ్ చేశారు. పతంజలి బ్రాండ్ నేమ్ తో దేశంలో వారి వ్యాపారాన్ని భారీగా విస్తరించుకున్నారని, కానీ, సబ్బులు, నెయ్యి, లో దుస్తులకు ఆ మహనీయుడి పేరు వాడుకోవడం సబబు కాదని స్పష్టం చేశారు. 

పతంజలి అనే పేరును ఉపయోగించుకునే హక్కు వారికెక్కడిదని ప్రశ్నించారు. పతంజలి పేరును తొలగించకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఎంపీ శరణ్ సింగ్ హెచ్చరించారు.

More Telugu News