Chiranjeevi: చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' ఫస్ట్ సింగిల్ గ్లింప్స్ ఇదిగో!

  • మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'వాల్తేరు వీరయ్య'
  • బాబీ దర్శకత్వంలో చిత్రం
  • రేపు బాస్ పార్టీ సాంగ్ విడుదల
  • నేడు ప్రోమో వీడియో పంచుకున్న చిత్రబృందం
First single glimpse video from Chiranjeevi Waltair Veerayya

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో వస్తున్న పక్కా మాస్ ఎంటర్టయినర్ 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమా నుంచి రేపు (నవంబరు 23) సాయంత్రం 4.05 గంటలకు ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో, నేడు ఆ పాటకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను చిత్రబృందం పంచుకుంది. 

"వెల్కమ్ టు ద బిగ్గెస్ట్ పార్టీ... బాస్ పార్టీ" అంటూ ఈ హుషారైన గీతం ప్రారంభమవుతుంది. అనంతరం, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్... "నువ్వు లుంగీ ఎత్తుకో, నువ్వు షర్ట్ ముడి వేసుకో, నువ్వు కర్చీఫ్ కట్టుకో... బాస్ వస్తుండు, బాస్ వస్తుండు" అంటూ పక్కా మాస్ పదజాలాన్ని కురిపించడం ఈ ప్రోమో వీడియోలో చూడొచ్చు.

 మొత్తానికి ఇది టైటిల్ సాంగ్ అని అర్థమవుతోంది. ఈ పాటను నకాష్ అజీజ్, హరిప్రియలతో కలిసి దేవిశ్రీ ప్రసాద్ కూడా ఆలపించారు. ఈ గీతానికి దేవిశ్రీనే సాహిత్యం అందించారు. ఈ పాటలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా మెగాస్టార్ సరసన తళుక్కుమన్నట్టు తెలుస్తోంది. 

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలు. 'వాల్తేరు వీరయ్య' చిత్రంలో శ్రుతిహాసన్, రవితేజ, కాథరిన్ ట్రెసా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News