Funeral: కర్మకాండలకూ ఓ స్టార్టప్.. అన్నీ వారే చేస్తారట!

  • కర్మకాండల నుంచి మరణ ధ్రువీకరణ పత్రం వరకు సేవలు
  • నెట్టింట వైరల్ అవుతున్న స్టార్టప్ మోడల్
  • ఇలాంటి వాటి అవసరం ఏముందన్న ఐఏఎస్ అధికారి అవనీశ్ వైష్ణవ్
Mumbai Startup for Funerals

విభిన్న ఆలోచనలతో కొత్తతరం ముందుకొస్తోంది. తమ ఆలోచనలను కార్యరూపంలో పెడుతూ స్టార్టప్‌లను ఏర్పాటు చేస్తోంది. ఫలితంగా ప్రపంచంలో మరే దేశంలో లేనంతంగా మన దేశంలో స్టార్టప్‌లు వెలుస్తున్నాయి. తాజాగా, ముంబైలో ప్రారంభమైన ఓ స్టార్టప్ అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఈ స్టార్టప్ కర్మకాండలు జరిపిస్తుందట. ‘సుఖాంత్ ఫ్యునరల్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ఏర్పాటైన ఈ స్టార్టప్ కర్మకాండలతోపాటు అంబులెన్స్ సర్వీస్, మరణ ధ్రువీకరణ పత్రం పొందేందుకు సాయం చేయడం వంటి సేవలు అందిస్తామంటోంది.

ఐఏఎస్ అధికారి అవనీశ్ వైష్ణవ్ ఈ స్టార్టప్ ఫొటోలను షేర్ చేస్తూ.. ఇలాంటి స్టార్టప్‌లతో అవసరం ఏముంది? అని పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు కూడా బాగానే స్పందిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని పెద్దలు చెప్పేవారని, ఇప్పుడది నిజమైందని అంటున్నారు. మనకంటే ఇలాంటి సేవలు కొత్త కావొచ్చు కానీ అమెరికాలో మాత్రం మామూలేనని మరికొందరు కామెంట్ చేశారు. కాగా, కర్మకాండలు నిర్వహించేందుకు ఈ స్టార్టప్ రూ. 35 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తుందట!

More Telugu News