Samantha: సమంత కసరత్తుపై 'ది యాక్షన్ జర్నీ ఆఫ్ యశోద' వీడియో రిలీజ్!

  • ఈ నెల 11వ తేదీన విడుదలైన 'యశోద'
  • తొలి ఆటతోనే హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమా 
  • సెకండ్ వీక్ లోకి అడుగుపెట్టిన 'యశోద'
  • ఆకట్టుకుంటున్న యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియో  
Yashoda Movie Update

సమంత ప్రధానమైన పాత్రను పోషించిన 'యశోద' .. ఈ నెల 11వ తేదీన విడుదలైంది. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, హరి - హరీశ్ దర్శకత్వం వహించారు. యాక్షన్ - ఎమోషన్ ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కింది. సరోగసి పేరుతో జరిగే ఒక అక్రమ వ్యాపారం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను భారీస్థాయిలో రిలీజ్ చేశారు.

తొలి రోజునే ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. సమంత నటనపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఆమె యాక్షన్ సీన్స్ లో చెలరేగిపోయిన విధానం పట్ల హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోయారు. ఈ సినిమా సెకండ్ వీక్ లోకి అడుగుపెట్టింది. 'యశోద స్థాయికి పోటీ ఇచ్చే సినిమాలేవీ లేకపోవడం వలన ఇంకా ఈ సినిమా థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ 'ది యాక్షన్ జర్నీ ఆఫ్ యశోద' అనే పేరుతో ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా రియలిస్టిక్ గా అనిపించడం కోసం సమంత ఎంతగా కసరత్తు చేసిందనేది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. సమంతను సుమ చేసిన ఇంటర్వ్యూ తాలూకు క్లిప్స్ ను .. మేకింగ్ షాట్స్ ను కలిపి ఈ వీడియోను వదిలారు. కథ పట్ల .. తన పాత్ర పట్ల సమంతకి గల అంకితభావానికి ఈ వీడియోను ఒక నిదర్శనంగా చెప్పుకోవాలంతే!

More Telugu News