BL Santosh: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

  • సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర
  • బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు
  • హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ
  • స్టే ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయస్థానం
  • తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు సంతోష్ ను అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు  
Telangana high court interim orders on BJP petition

తెలంగాణలో ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిన వ్యవహారం సంచలనం సృష్టించింది. దీనిపై సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. దీనిపై బీజేపీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. బీఎల్ సంతోష్ కు జారీ చేసిన సిటీ నోటీసులను రద్దు చేయాలని కోరింది. 

ఈ నేపథ్యంలో, బీజేపీ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. అయితే బీఎల్ సంతోష్ కు నోటీసులపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగాలని సూచించింది. అదే సమయంలో సిట్ దర్యాప్తునకు బీఎల్ సంతోష్ సహకరించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.

More Telugu News