Uttar Pradesh: యూపీ జైలులో 140 మంది హెచ్ఐవీ రోగులు

  • 2016 నుంచి జైలులోనే హెచ్ఐవీ బాధిత ఖైదీలు 
  • ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్న అధికారులు
  • ఖైదీలతో కిక్కిరిసిన దస్నా జైలు
140 inmates of Uttarapradesh Dasna jail test HIV positive

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జైలులో హెచ్ఐవీ సోకిన ఖైదీలు 140 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. జైలు లోపలికి వచ్చే ప్రతీ ఖైదీకి హెచ్ఐవీ, టీబీ పరీక్షలు చేయించడం తప్పనిసరి. దీంతో 2016లో జైలుకు వచ్చిన 49 మంది ఖైదీలు హెచ్ఐవీ బాధితులని తేలింది. అప్పటి నుంచి ఆ ఖైదీలు జైలులోనే ఉంటున్నారు. ప్రస్తుతం ఈ వైరస్ సోకిన బాధితుల సంఖ్య 140కి చేరిందని అధికారులు తెలిపారు. అందులో 35 మందికి టీబీ కూడా సోకిందని వివరించారు.

హెచ్ఐవీ బాధితులకు దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు దస్నా జైలు అధికారులు తెలిపారు. దస్నా జైలు ఖైదీలతో కిక్కిరిసి పోయిందని అధికారులు చెప్పారు. జైలులో 1706 ఖైదీలను ఉంచేందుకు మాత్రమే సదుపాయాలు ఉండగా.. ప్రస్తుతం 5500 మంది ఖైదీలు ఉన్నారని పేర్కొన్నారు. కాగా, రోగనిరోధక శక్తిని నిర్వీర్యం చేసే ఈ వైరస్ సోకినవాళ్లు సరైన చికిత్స తీసుకోకుంటే ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. హెచ్ఐవీ ముదిరి ఎయిడ్స్ గా మారుతుందని, దీనికి పూర్తిస్థాయిలో చికిత్స లేదని తెలిపారు.

More Telugu News