Facebook: ఫేస్ బుక్ ప్రొఫైల్ లో కీలక మార్పులు.. ప్రతి యూజర్ తెలుసుకోవాల్సిందే

  • ప్రొఫైల్ లో మత, రాజకీయ అభిప్రాయాల తొలగింపు
  • లైంగిక అభిరుచులు, చిరునామా వివరాలు సైతం డిలీట్
  • యూజర్లకు మెటా నుంచి నోటిఫికేషన్
Facebook to remove sexual preference religion and address from users profile

ఫేస్ బుక్ ప్రొఫైల్ పరంగా కొన్ని మార్పులు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా ప్రకటించింది. యూజర్ల ప్రొఫైల్ నుంచి వారి లింగ ప్రాధాన్యత, మతపరమైన అభిప్రాయాలు, రాజకీయ అభిప్రాయాలు, చిరునామాను ఫేస్ బుక్ తొలగించనుంది. 

లోగడ ఫేస్ బుక్ యూజర్లు ప్రొఫైల్ క్రియేట్ చేసుకునే సమయంలో.. మతపరమైన అభిప్రాయాలు, రాజకీయాలకు సంబంధించి తమ అభిప్రాయాలు, వారి లైంగిక అభిరుచులతో కూడిన పూర్తి వివరాలను అడిగేది. దీంతో యూజర్లు ఫేస్ బుక్ ప్రొఫైల్ క్రియేషన్ లో భాగంగా చాలా సమయం వెచ్చించి ఆ వివరాలన్నీ నింపేవారు. ఇప్పుడు ఈ ప్రొఫైల్ కు సంబంధించి యూజర్లకు ఫేస్ బుక్ నోటిఫికేషన్లను పంపిస్తోంది. ఈ విధమైన సమాచారాన్ని వారి ప్రొఫైల్ నుంచి తొలగిస్తున్నట్టు తెలిపింది. 

ఈ ఫీల్డ్ లను (ఆయా వివరాలు) నింపిన వారికి నోటిఫికేషన్లు పంపిస్తున్నట్టు ఫేస్ బుక్ ప్రకటించింది. అంతమాత్రాన యూజర్లు ఫేస్ బుక్ వేదికగా ఈ సమాచారం షేర్ చేసుకోవడంపై ప్రభావం పడదు’’ అంటూ ఈ మెయిల్ నోటిఫికేషన్ లో మెటా పేర్కొంది. 

More Telugu News