North Korea: ఉత్తర కొరియా వద్ద అమెరికాను తాకే మిసైల్: జపాన్

  • తాజాగా మరో బాలిస్టిక్ క్షిపణి పరీక్ష నిర్వహించిన ఉత్తర కొరియా
  • అది జపాన్ సముద్ర జలాల్లో పడిపోయిన వైనం
  • తమకు ఆమోదనీయం కాదన్న జపాన్ ప్రధాని
North Korea missile had the range to reach US mainland Japan says

ఉత్తర కొరియా దూకుడు తగ్గడంలేదు. శుక్రవారం కూడా క్షిపణి పరీక్ష నిర్వహించింది. అమెరికా ప్రధాన భూభాగాన్ని ఇది తాకగలదని జపాన్ రక్షణ శాఖ మంత్రి యసుకజు హమదా పేర్కొన్నారు. ఈ మిసైల్ 15,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కొట్టి పడేయగలదన్నారు. 

ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడం రెండు వారాల వ్యవధిలో రెండోసారి. ఈ క్షిపణి జపాన్ కు చెందిన హొక్కయిదో దీవి ఉత్తరాన ఒషిమా-ఒషిమా పశ్చిమాన 200 కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ అయింది. ఇది తమ సముద్ర జలాల్లో పడినట్టు జపాన్ ప్రధాని కిషిదా ప్రకటించారు. తమకు ఆమోదనీయం కాదన్నారు.

ఈ నెల 3న కూడా ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించగా, అది లక్ష్యాన్ని చేరడంలో విఫలమైనట్టు నిపుణులు చెబుతున్నారు. ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ హాసంగ్-17 అనే క్షిపణి అభివృద్దిలో భాగంగా ఉత్తర కొరియా ఈ ప్రయోగాలు నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. మొదటి నుంచి ఉత్తర కొరియా అడపా, దడపా క్షిపణి పరీక్షలు నిర్వహించడం పరిపాటిగా వస్తోంది. తద్వారా అమెరికా తమ జోలికి రాకుండా చేసుకోవడమే ఆ దేశ లక్ష్యంగా ఉంది.

More Telugu News