Harish Rao: అసెంబ్లీ ఆమోదించిన బిల్లుపై అసంతృప్తి.. హరీశ్ రావును రాజ్ భవన్ కు రమ్మన్న తమిళిసై

  • మెడికల్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగ విరమణ వయసును పెంచుతూ అసెంబ్లీ ఆమోదం
  • అభ్యంతరం వ్యక్తం చేస్తున్న గవర్నర్
  • హరీశ్ ను వివరణ కోరనున్న తమిళిసై
Tamilisai calls Harish Rao to Raj Bhavan

తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదముద్ర వేసే విషయంలో గవర్నర్ తమిళిసై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పలు బిల్లులకు ఆమోదం తెలపకుండా తన వద్దే ఉంచుకుంటున్నారు. పూర్తి క్లారిటీ ఉంటేనే ఆమోదిస్తున్నారు. ఈ క్రమంలో... రాజ్ భవన్ కు రావాలంటూ తాజాగా ఆరోగ్యమంత్రి హరీష్ రావుకు పిలుపు వచ్చింది. 

మెడికల్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగ విరమణ వయస్సును పెంచుతూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుపై తమిళిసై అసంతృప్తితో ఉన్నారు. టీచింగ్ స్టాఫ్ తో పాటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పోస్టుల రిటైర్మెంట్ వయస్సును పెంచడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే హరీశ్ కు రాజ్ భవన్ కు రావాలంటూ పిలుపు వచ్చింది. బిల్లుకు సంబంధించి మంత్రి నుంచి ఆమె వివరణ కోరనున్నారు. బిల్లు విషయానికి వస్తే... వయో పరిమితిని 62 నుంచి 65 ఏళ్లకు పెంచడం జరిగింది.

More Telugu News