Low Pressure: బంగాళాఖాతంలో అల్పపీడనాల జోరు... తాజాగా మరొకటి!

  • ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
  • ఈ నెల 19 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం
  • అనంతరం దక్షిణ కోస్తాంధ్ర దిశగా పయనం
  • ఈ నెల 21న పలు చోట్ల భారీ వర్షాలు
Another low pressure area formed in Bay Of Bengal

ఈశాన్య రుతుపవనాల సీజన్ నేపథ్యంలో బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. తాజాగా, ఆగ్నేయ బంగాళాఖాతం-ఉత్తర అండమాన్ సముద్రాలను ఆనుకుని ఈ ఉదయం అల్పపీడనం ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. 

ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఈ నెల 19 నాటికి వాయుగుండంగా బలపడి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమవుతుందని ఐఎండీ వివరించింది. ఆపై రాగల మూడ్రోజుల్లో ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర దిశగా ప్రయాణిస్తుందని పేర్కొంది.

దీని ప్రభావంతో ఈ నెల 21న ఏపీ దక్షిణ కోస్తాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. గంటకు 55 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందని తెలిపింది.

More Telugu News