MS Dhoni: టెన్నిస్ లోనూ విజేతగా నిలిచిన కెప్టెన్ కూల్... వివరాలు ఇవిగో

  • ఝార్ఖండ్ లో జేఎస్ సీఏ ఆధ్వర్యంలో ఏటా టెన్నిస్ టోర్నీ
  • టెన్నిస్ ప్లేయర్ గా ఈ టోర్నీలో పాల్గొంటున్న ధోనీ
  • ఇప్పటికే రెండు సార్లు విజేతగా నిలిచిన కెప్టెన్ కూల్
  • తాజా గెలుపుతో వరుసగా మూడు టైటిళ్లు గెలుచుకున్న వైనం
ms dhoni wins tennis title in Jharkhand

కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి క్రికెట్ మాత్రమే కాదు.. ఫుట్ బాల్ కూడా వచ్చు. టెన్నిస్ కూడా అతడు అద్భుతంగా ఆడతాడు. క్రికెటర్ గా విశ్వవ్యాప్తంగా ఏ ఒక్కరికీ దక్కని గుర్తింపును సంపాదించుకున్న ధోనీ... అంతర్జాతీయ క్రికెట్ కు ఎప్పుడో గుడ్ బై చెప్పేశాడు. ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్న మహీ... త్వరలోనే దానికి కూడా వీడ్కోలు పలికే దిశగా సాగుతున్నాడు. ప్రస్తుతం తన సొంతూరు రాంచీలో ప్రకృతి సాగు చేస్తున్న ధోనీ... ఇతరత్రా క్రీడల్లో పాలుపంచుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడు టెన్సిల్ లో విజేతగా నిలిచి ట్రోఫీ అందుకుంటున్న ఫొటో ఒకటి మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

ధోనీ సొంత రాష్ట్రం ఝార్ఖండ్ లో ఏటా జేఎస్ సీఏ టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతోందట. ఈ టోర్నీలో ఏటా ఓ టెన్నిస్ ప్లేయర్ హోదాలో పాలుపంచుకుంటున్న ధోనీ... ఈ ఏడాది నిర్వహించిన టోర్నీలో ఏకంగా విజేతగా నిలిచాడు. స్థానిక టెన్నిస్ ప్లేయర్ సుమిత్ కుమార్ బజాజ్ తో కలిసి మెన్స్ డబుల్స్ విభాగంలోకి దిగిన ధోనీ విజేతగా నిలిచాడు. ఈ సందర్భంగా టోర్నీ నిర్వాహకుల నుంచి అతడు ట్రోఫీని అందుకున్నాడు. ఈ ఫొటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ టోర్నీలో ఈ ఏడాదే కాదండోయ్... ఇప్పటికే రెండు సార్లు ధోనీ విజేతగా నిలిచాడట. తాజా విజయంతో అతడు వరుసబెట్టి మూడేళ్ల పాటు 3 టైటిళ్లను అందుకున్నాడట.

More Telugu News