dog: వినాయకుడి విగ్రహం ముందు మోకరిల్లిన శునకం.. వీడియో వైరల్

  • యజమానితో కలిసి గుడికి వెళ్లిన పెంపుడు కుక్క
  • పూణే గుడిలో వినాయకుడిపై భక్తి చూపెట్టిన శునకం
  • వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన నెటిజన్
Dog bows down pays respect to Lord Ganesha   Video is viral

సాధారణంగా తమ యజమాని పట్ల శునకాలు ఎంతో ప్రేమను, విశ్వాసాన్ని చూపిస్తాయి. వాళ్లు చెప్పినట్టు చేస్తుంటాయి. అయితే, ఓ శునకానికి దేవుడిపై భక్తి కూడా ఎక్కువైంది. యజమానితో కలిసి గుడికి వెళ్లిన శునకం.. వినాయకుడి విగ్రహం ముందు రెండు కాళ్లు వంచి మోకరిల్లింది. ఈ వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ అయింది. యజమాని విగ్రహం ముందు నిలుచొని దండం పెట్టుకోగా.. కుక్క కూడా భక్తిని చూపెట్టింది. 

దీన్ని ఒకరు వీడియో తీసి నెట్ లో పెట్టడంతో అది వైరల్ అయ్యింది. ఈ వీడియో లొకేషన్‌ను గుర్తించలేనప్పటికీ, వీడియోలోని వ్యక్తి విశాల్ అని, ఈ గణపతి ఆలయం పూణేలో ఉందని కామెంట్ల ద్వారా తెలుస్తోంది. పూణేలోని దగ్దుషేత్ గణపతి మందిరం ముంగిట శునకం ఇలా తన భక్తిని ప్రదర్శించిందని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.

More Telugu News