Ramcharan: న్యూజిలాండ్ లో చరణ్ ఆటా పాటా!

  • తాజా షెడ్యూల్ షూటింగులో చరణ్
  • ఈ షెడ్యూల్ కి హాజరైన కియారా అద్వాని
  • తమన్ సంగీతం హైలైట్ అంటూ టాక్ 
  • వచ్చే ఏడాదిలో సినిమా రిలీజ్  
Charan and Shankar movie update

చరణ్ హీరోగా శంకర్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. కెరియర్ పరంగా చరణ్ కి ఇది 15వ సినిమా. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఇటీవలే షూటింగుకి బ్రేక్ ఇవ్వడంతో ఉపాసనతో కలిసి చరణ్ విదేశాలకి వెళ్లి వచ్చాడు. ఈ సినిమా తాజా షెడ్యూల్ న్యూజిలాండ్ లో జరుగుతోంది. 

చరణ్ - కియారా అద్వానిపై పాటలను చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. గతంలో చరణ్ సినిమాలకి మంచి పాటలను ఇచ్చిన తమన్, ఈ సారి అంతకుమించి అనే స్థాయిలో పాటలు ఉండేలా కష్టపడుతున్నాడని అంటున్నారు. శంకర్ మార్క్ చిత్రీకరణతో పాటలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. 

ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంతో కూడిన పాత్ర ఒకటయితే, మోడ్రన్ లుక్ తో కూడిన పాత్ర మరొకటి. ఈ రెండు పాత్రల మధ్య వేరియేషన్ ను శంకర్ డిజైన్ చేసిన తీరు గొప్పగా ఉంటుందని చెబుతున్నారు. చరణ్ తో కియార చేస్తున్న రెండవ సినిమా ఇది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

More Telugu News