T20 World Cup: నో బాల్, ఆపై వైడ్ బాల్... ఎక్స్ ట్రా పరుగులతో పాక్ ఇన్నింగ్స్ ప్రారంభం

  • తొలి బంతిని నో బాల్ గా వేసిన బెన్ స్టోక్స్ 
  • ఆ తర్వాతి బంతిని వైడ్ గా వేసిన వైనం
  • క్రిస్ వోక్స్ కూడా వైడ్ తోనే ఓవర్ ను మొదలెట్టిన వైనం
  • 2 ఓవర్లలో పాక్ స్కోరు 12 పరుగులు
ben stokes starts england bowling with no ball and wide ball

టీ 20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో చివరిదైన టైటిల్ పోరు కాసేపటి క్రితం మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ఛేజింగ్ ఎంచుకోగా... పాకిస్థాన్ తన ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఎప్పటిమాదిరే కెప్టెన్ బాబర్ అజమ్ తో కలిసి స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పాక్ ఇన్నింగ్స్ ను ఆరంభించాడు. టైటిల్ విజేతను ఖరారు చేసే ఈ మ్యాచ్ లో పాక్ బ్యాటర్లకు తొలి ఓవర్ వేసిన ఇంగ్లండ్ ఫేసర్ బెన్ స్టోక్స్ తొలి రెండు బంతుల్లోనే 2 పరుగులు ఇచ్చేశాడు.

ఇంగ్లండ్ బౌలింగ్ ను ప్రారంభించిన బెన్ స్టోక్స్ తొలి బంతినే నో బాల్ గా సంధించాడు. దీంతో బ్యాటుతో పని లేకుండానే పాక్ ఖాతాలో ఓ పరుగు చేరడంతో పాటు ఆ తర్వాతి బంతి ఫ్రీ హిట్ గా లభించింది. అయితే రెండో బంతిని వైడ్ గా వేసిన స్టోక్స్ మరో పరుగును పాక్ కు ఇచ్చేశాడు. వెరసి తొలి రెండు బంతులను నో బాల్, వైడ్ బాల్ గా వేసిన స్టోక్స్ పాక్ ఖాతాలో 2 పరుగులను చేర్చాడు. తన తొలి ఓవర్ లో అతడు పాక్ కు 8 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక స్టోక్స్ తర్వాత బౌలింగ్ కు దిగిన క్రిస్ వోక్స్ కూడా తన తొలి బంతిని వైడ్ గా వేయడం గమనార్హం. 2 ఓవర్లు ముగిసే సరికి పాక్ 12 పరుగులు చేసింది. క్రీజులో బాబర్ (5), రిజ్వాన్ (4) పరుగులతో ఉన్నారు.

More Telugu News