Ramcharan: సినిమాలు ఫెయిలవడానికి రామ్ చరణ్ చెప్పిన కారణమిదే!

  • సినిమా నిర్మాణ ఖర్చుకు పరిమితి ఉండాలి..
  • పారితోషికం కూడా తగ్గించుకోవాల్సిందే
  • హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో వ్యాఖ్య
  • బాలీవుడ్ హీరో అక్షయ్ తో కలిసి పాల్గొన్న రామ్ చరణ్
Ram Charan and Akshay Kumar Shocking Comments About Movies Flaps

భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.. పెద్ద హీరోలు, పేరొందిన డైరెక్టర్లు, ఖర్చుకు వెనకాడకుండా చేస్తున్న గ్రాఫిక్స్ కూడా సినిమాను గట్టెక్కించలేకపోతున్నాయి. తెలుగు సినిమాలతో పాటు హిందీ సినిమాలకూ ఈ పరాజయాలు తప్పట్లేదు. ఈ నేపథ్యంలో ఎంతో కష్టపడి, మరెంతో ఖర్చు పెట్టి తీస్తున్న సినిమాలు నిర్మాతలకు నష్టాలను మిగల్చడంపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా స్పందించారు. ఢిల్లీలో హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాలు ఫెయిలవడానికి కారణమేంటని ప్రశ్నించిన విలేకరులకు జవాబిచ్చారు. 

కథలో బలంలేకపోవడం వల్లే సినిమాలు ఆడట్లేదని రామ్ చరణ్ తేల్చేశారు. మంచి కథలను ప్రేక్షకులు ఎప్పుడైనా సరే ఆదరిస్తూనే ఉంటారని చెప్పారు. ఆర్ఆర్ఆర్ తర్వాత అతిథి పాత్రలో నటించిన ఆచార్య సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో స్క్రిప్ట్ నుంచి మేకింగ్ వరకు అన్నింటిపైనా ఎగ్జిబిటర్ పునరాలోచించుకోవాలని రామ్ చరణ్ సూచించారు. సినిమా నిర్మాణ ఖర్చును తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం తమ రెమ్యునరేషన్ ను తగ్గించుకున్నట్లు ఆయన వివరించారు. మరోవైపు, థియేటర్లలో పాప్ కార్న్, సమోసాలతో పాటు అన్నింటి రేట్లు తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

సినిమా నిర్మించిన వారిదే బాధ్యత.. అక్షయ్
సినిమా హిట్ కాకపోవడానికి కారణం ప్రేక్షకులు కారని, సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న వారే బాధ్యులని అక్షయ్ కుమార్ తేల్చేశారు. థియేటర్లదాకా వాళ్లను రప్పించాలంటే వాళ్లు ఆశించేదాన్ని సినిమా ద్వారా మేం అందించగలగాలని చెప్పారు. వాళ్లకు కావాల్సింది ఇవ్వలేనప్పుడు పరాజయం తప్పదని వివరించారు. ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. థియేటర్లలో టికెట్ రేట్లు పెరిగాయని గుర్తుచేస్తూ.. వినోదం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టేందుకు ప్రజలు ఇష్టపడట్లేదని వివరించారు. అందుకే సినిమా నిర్మాణ ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు.

More Telugu News