T20 World Cup: టాస్ గెలిచిన ఇంగ్లండ్... టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో ఛేజింగ్ ను ఎంచుకున్న బట్లర్

  • ఎంజీసీ వేదికగా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్
  • పాక్ ను ఫస్ట్ బ్యాటింగ్ కు ఆహ్వానించిన వైనం
England won the toss and choose bowling first

టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో టైటిల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఆస్ట్రేలియాలోని ప్రతిష్ఠాత్మక మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్ కు సంబంధించిన టాస్ కాసేపటి క్రితం ముగిసింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ జాస్ బట్లర్ ఛేజింగ్ ను ఎంచుకున్నాడు. ప్రత్యర్థి జట్టు పాకిస్థాన్ ను తొలుత బ్యాటింగ్ కు ఆహ్వానించిన బట్లర్... తాము తొలుత బౌలింగ్ చేస్తామని తెలిపాడు. 

ఎంసీజీ వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానున్న టైటిల్ పోరులో పాక్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కు ఇరు జట్లు సెమీ ఫైనల్లో ఆడిన ఆటగాళ్లతోనే బరిలోకి దిగుతున్నాయి. ఛేజింగ్ లో ఇంగ్లండ్ ఏ స్థాయిలో వీర విహారం చేయనుందో భారత్ తో జరిగిన సెమీ ఫైనల్ లో తేలిపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తన ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేస్తే తప్పించి ఆ జట్టుకు గెలుపు అవకాశాలు ఉండవన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే... వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే అవకాశాలున్నాయన్న వాదనలను పటాపంచలు చేస్తూ మెల్ బోర్న్ లో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఫలితంగా ఈ మ్యాచ్ కు వర్షం వల్ల ఎలాంటి అంతరాయం ఏర్పడదని తేలిపోయింది.

More Telugu News