Telangana: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్... కేసు నమోదు చేసిన బంజారా హిల్స్ పోలీసులు

  • తెలంగాణలో కలకలం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు
  • యూపీ, గుజరాత్ ల నుంచి బెదిరింపులు వస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు
  • కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన బంజారా హిల్స్ పోలీసులు
banjara hill police registers another case on threatening calls to trs mlas

తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. ఇప్పటికే ఈ కేసులో పలు పరిణామాలు చోటుచేసుకోగా... ఆదివారం ఈ వ్యవహారంలో మరో కొత్త కేసు నమోదైంది. ఈ కేసులో బాధితులుగా ఉన్న టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీనిపై ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయగా... బంజారా హిల్స్ పోలీసులు కొత్తగా ఓ కేసు నమోదు చేశారు. 

ఉత్తరప్రదేశ్, గుజరాత్ ల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు తమకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డిలు ఆదివారం బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న బంజారా హిల్స్ పోలీసులు సదరు ఫోన్ కాల్స్ వచ్చిన నెంబర్లను సేకరించి... టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి బెదిరిస్తున్న వారెవరన్న విషయాలను నిగ్గు తేల్చే పనిలో పడ్డారు.

More Telugu News