Pakistan: భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా

  • బిలియన్ డాలర్ల విలువైన జట్టు కంటే పాకిస్థాన్ ముందుందని వ్యాఖ్య
  • గతంలో ఆసియాకప్‌లో పాక్ ఓడినప్పుడు కూడా భారత్‌ను టార్గెట్‌ చేసిన రమీజ్ రాజా
  • నేడు పాకిస్థాన్-ఇంగ్లండ్ మధ్య టీ20 ప్రపంచకప్‌ ఫైనల్
PCB Chairman Ramiz Raja once again Targets Team India

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్, మాజీ క్రికెటర్ రమీజ్ రాజా మరోమారు భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు. టీమిండియాను ఉద్దేశించి బిలియన్ డాలర్ల విలువైన జట్టు కంటే తాము ఎంతో ముందున్నామని పాకిస్థాన్ నిరూపించిందని పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన శ్రీలంక ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడినా రమీజ్ రాజా భారత్‌ను టార్గెట్‌ చేసుకున్నాడు. టీమిండియా అభిమానులకు ఇప్పుడు సంతోషంగా ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఇప్పుడు మరోమారు నోటికి పనిచెప్పాడు. 

నిజానికి టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ రాణించిన తీరు అద్భుతం. భారత్, జింబాబ్వే చేతుల్లో ఓటమి పాలై దాదాపు నిష్క్రమించిన స్థితిలో అద్భుతంగా పుంజుకుంది. ఆ తర్వాత వరుస విజయాలు సాధించడంతోపాటు సూపర్-12 చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా అనూహ్య ఓటమి పాకిస్థాన్‌కు కలిసొచ్చింది.

నేడు ఇంగ్లండ్-పాకిస్థాన్ మధ్య మెల్‌బోర్న్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్ 2009లో టీ20 ప్రపంచకప్ గెలుచుకోగా, ఇంగ్లండ్ 2010 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. వెస్టిండీస్ రెండుసార్లు పొట్టి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. నేటి మ్యాచ్‌లో విజయం సాధించే జట్టు రెండు ప్రపంచకప్‌లు గెలుచుకున్న జట్టుగా విండీస్ సరసన చేరనుంది.

More Telugu News