Hyderabad: ఐబీఎస్ లో ర్యాగింగ్ పై కేసు... 12 మంది విద్యార్థులను సస్పెండ్ చేసిన యాజమాన్యం

  • ఇటీవలే ఐబీఎస్ లో ర్యాగింగ్ ఘటన
  • బాధిత విద్యార్థి నేరుగా కేటీఆర్ కు ట్వీట్ ద్వారా ఫిర్యాదు
  • 12 మందిపై కేసు నమోదు చేసిన శంకర్ పల్లి పోలీసులు
  • నిందితులను ఏడాది పాటు సస్పెండ్ చేసిన ఐబీఎస్

హైదరాబాద్ లోని ఇక్ఫాయ్ బిజినెస్ స్కూల్ లో ర్యాగింగ్ ఘటన కలకలం రేపుతోంది. ఓ మతానికి చెందిన విద్యార్థిని మరో మతానికి చెందిన పలువురు విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. ఈ సందర్భంగా తమ మతానికి జై కొట్టాలంటూ నిందితుల ఒత్తిడి మేరకు బాధిత విద్యార్థి నినాదాలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే ఐబీఎస్ లో ఈ ఘటన చోటుచేసుకోగా,... బాధిత విద్యార్థి ఫిర్యాదును పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే తనపై జరిగిన ర్యాగింగ్ ఘటనను తెలుపుతూ బాధిత విద్యార్థి తెలంగాణ మంత్రి కేటీఆర్ కు నేరుగా ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వెలుగులోకి వచ్చినంతనే సైబరాబాద్ పరిధిలోని శంకర్ పల్లి పోలీసులు ర్యాగింగ్ ఘటనపై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. శుక్రవారమే శంకర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేయగా.. కేసులో నిందితులైన 12 మంది విద్యార్థులను ఐబీఎస్ యాజమాన్యం ఏడాది పాటు సస్పెండ్ చేసింది.

More Telugu News