CPI Narayana: మోదీకి నల్ల జెండాలతో స్వాగతం పలుకుతాం: సీపీఐ నారాయణ

  • ఏపీ, తెలంగాణకు మోదీ చేసిందేమీ లేదన్న నారాయణ
  • వైజాగ్, రామగుండం బంద్ కు పిలుపునిచ్చామని వ్యాఖ్య
  • గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్
Will welcome Narendra Modi with black flags says CPI Narayana

గవర్నర్ వ్యవస్థతో వచ్చే లాభం ఏమీ లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఈ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఎక్కువ కాలం తొక్కిపెట్టడం మంచిది కాదని అన్నారు. గవర్నర్ వ్యవస్థతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఇబ్బంది పెడుతోందని విమర్శించారు.

ప్రధాని మోదీ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేశారని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాలకు ఏమీ ఇవ్వని మోదీ ఇక్కడకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేసిన మోదీ వైజాగ్ కు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణకు ఏమీ చేయని మోదీ రామగుండంకు ఎందుకు వస్తున్నారని అడిగారు. విశాఖ, రామగుండంలలో మోదీకి నల్ల జెండాలతో స్వాగతం పలుకుతామని చెప్పారు. ప్రధాని రాకను నిరసిస్తూ విశాఖ, రామగుండం బంద్ లకు పిలుపునిచ్చామని తెలిపారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News