Telangana: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం... పోలీసు కస్టడీకి ముగ్గురు నిందితులు

  • టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేల కొనుగోలు యత్నంపై కేసు
  • రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్ ల అరెస్ట్
  • నిందితులను 5 రోజుల కస్టడీ కోరిన తెలంగాణ పోలీసులు
  • 2 రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించిన ఏసీబీ కోర్టు
acb court allows police custody for mlas poaching case accused

తెలంగాణలో సంచలన రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బుధవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన రోజే.. ఈ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 


టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించారన్న ఆరోపణలపై రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరు చంచల్ గూడ జైల్లో ఉన్నారు. వీరిని తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. 

ఈ సందర్భంగా నిందితులను 5 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు కోర్టును కోరారు. పోలీసుల వినతికి సానుకూలంగా స్పందించిన కోర్టు నిందితులను 2 రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలో రేపు ఉదయం చంచల్ గూడ జైలు నుంచి నిందితులను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు.

More Telugu News