Lakshman: ఎరువుల ఫ్యాక్టరీని మోదీ ప్రారంభిస్తే.. కేసీఆర్ కు కడుపు మంట ఎందుకు?: కె.లక్ష్మణ్

  • మోదీ పర్యటనను ఎదుర్కొంటామని కేసీఆర్ అంటున్నారన్న లక్ష్మణ్ 
  • రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శ 
  • కమ్యూనిస్టులు కేసీఆర్ కనుసన్నల్లో పని చేయడం దురదృష్టకరమని వ్యాఖ్య 
Lakshman fires on KCR

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారని... మోదీని రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి వ్యాఖ్యలను చేస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలుపుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. మునుగోడులో వందల కోట్లు ఖర్చు చేసి టీఆర్ఎస్ గెలిచిందని అన్నారు. కమ్యూనిస్టులు కేసీఆర్ కనుసన్నల్లో పని చేయడం దురదృష్టకరమని చెప్పారు. కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలనను ఎదుర్కొనే సామర్థ్యం బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర నిధులతో మోదీ అభివృద్ధికి బాటలు వేస్తున్నారని లక్ష్మణ్ తెలిపారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని ప్రారంభిస్తారని చెప్పారు. ఎరువుల కర్మాగారాన్ని మోదీ ప్రారంభిస్తే కేసీఆర్ కు కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని చెప్పారు. కేసీఆర్ కు మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయగా మారిందని దుయ్యబట్టారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్... ఊరికో ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు.

More Telugu News