Humans of Bombay post: జుట్టు పొట్టిగా ఉందని ఓ షో నుంచి తొలగించారు: నటి లీసా రే

  • బోన్‌మారోలో అత్యంత అరుదైన మైలోమా అనే వ్యాధితో బాధపడిన లీసారే
  • మూడేళ్ల పోరాటం తర్వాత కేన్సర్‌పై విజయం సాధించిన నటి
  • నేషనల్ కేన్సర్ అవేర్‌నెస్ డే సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించిన లీసా రే
Lisa Ray says She was replaced from a travel show as she had short hair due to cancer

ప్రముఖ నటి, మోడల్ లీసారే ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు. లీసారే 2009లో బోన్‌మారోలో అత్యంత అరుదైన కేన్సర్ బారినపడ్డారు. నిజానికి ఈ కేన్సర్ నుంచి బతికి బయటపడడం చాలా కష్టం. అయితే, లీసా రే మాత్రం కేన్సర్‌తో ధైర్యంగా పోరాడారు. గుండె ధైర్యాన్ని కోల్పోకుండా ఆమె చేసిన పోరాటానికి  ఫలితం దక్కింది. కేన్సర్‌ను జయించారు. తాజాగా, ఆమె మాట్లాడుతూ.. కేన్సర్ కారణంగా కీమోథెరపీ చేయించుకుంటున్న సమయంలో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. 

కీమోథెరపీ చేయించుకునే సమయంలో జుట్టు పొట్టిగా ఉండడంతో తనను ఓ టీవీ షో నుంచి తొలగించారని రే గుర్తు చేసుకున్నారు. లీసా రే బోన్‌మారోలో అత్యంత అరుదైన మైలోమా అనే వ్యాధితో బాధపడ్డారు. మూడేళ్ల పోరాటం తర్వాత ఆమె కోలుకోగలిగారు. ఈ మూడేళ్లు గుండె ధైర్యాన్ని కోల్పోకుండా ఆమె చేసిన పోరాటం కారణంగా శస్త్రచికిత్స లేకుండా బయటపడగలిగారు. అయితే క్రమం తప్పకుండా కీమోథెరపీ చేయించుకోవాల్సి రావడంతో జుట్టు లేకుండానే గడిపారు. ఈ క్రమంలో పొట్టి జుట్టు కారణంగా అప్పటికే చేస్తున్న ఓ ట్రావెల్ షో నుంచి తనను తొలగించారని చెబుతూ నటి వాపోయారు. 

‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే పోస్ట్’లో ఆమె తనకు ఎదురైన ఈ అనుభవాన్ని నేషనల్ కేన్సర్ అవేర్‌నెస్ డే సందర్భంగా పంచుకున్నారు. కాగా, లీసారే పాప్యులర్ సినిమాలైన వాటర్, కసూర్, వీరప్పన్, దోబారా వంటి వాటిలో నటించారు. చివరిసారి ఆమె ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్’లో కనిపించారు. టీవీ షోల నుంచి తప్పుకున్న తర్వాత ‘క్లోజ్ టు ది బోన్: ఎ మెమోయిర్ బై లీసా రే’ పేరుతో పుస్తకం రాశారు.

More Telugu News