Telangana: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు రామచంద్ర భారతిపై మరో కేసు నమోదు

  • ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక నిందితుడు రామచంద్ర భారతి
  • నకిలీ ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ తయారు చేసుకున్నారన్న ఆరోపణ  
  • ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదుతో బంజారా హిల్స్ పీఎస్ లో కేసు నమోదు
banjara hill police registers another case on ramachandra bharathi

టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఠాలోని కీలక నిందితుడు రామచంద్ర భారతిపై మరో కేసు నమోదైంది. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.  

ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ లకు సంబంధించి రామచంద్ర భారతి నకిలీ కార్డులను తయారు చేసుకున్నారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రామచంద్ర భారతిపై బంజారా హిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ కేసులో దోషిగా తేలితే రామచంద్ర భారతికి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని సమాచారం.

More Telugu News